TG: హాస్టల్ విద్యార్థులకు మెస్ చార్జీలు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య స్వాగతించారు. కాలేజీ హాస్టళ్ల విద్యార్థుల మెస్ చార్జీలను రూ.1500 నుంచి రూ.2100కు రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. అయితే తాము రూ.3000 డిమాండ్ చేసినప్పటికీ.. సీఎం రేవంత్ రూ.2100 ఇచ్చారని ఇది మంచి నిర్ణయమన్నారు. అదేవిధంగా హాస్టళ్లలో స్టాప్‌ను పెంచడం, మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు.