రష్యా-ఉక్రెయిన్ మధ్య నెలకొన్న సుదీర్ఘ యుద్ధంలో రష్యా కివ్పై భీకరదాడులు చేస్తూనే ఉంది. తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ స్పందిస్తూ.. రష్యాకు మద్ధతుగా ఉత్తరకొరియా వేల సంఖ్యలో సైనికులను పంపిందన్నారు. వారిని ఎదుర్కోవాలంటే క్షిపణులు ప్రయోగించాలని.. దానికి మిత్ర దేశాలు అనుమతివ్వాలని కోరారు. సుదూర లక్ష్యాలను ఛేదించే క్షిపణుల సౌలభ్యం ఉంటే వారిపై నిఘా పెడతామని జెలెన్స్కీ పేర్కొన్నారు.