కృష్ణా: ముసునూరు మండలం బలివే గ్రామంలో సీపీఐ అనుబంధ రైతు సంఘం ఆధ్వర్యంలో శనివారం సమావేశం నిర్వహించారు. రైతు సంఘం ఏలూరు జిల్లా నేత నరసింహ మాట్లాడుతూ.. వ్యవసాయ పెట్టుబడిగా అందించే అన్నదాత సుఖీభవ నిధులు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు అన్ని రైతు భరోసా కేంద్రాలలో ఈ నెల 4వ తేదీన వినతి పత్రాలు ఇవ్వనున్నట్లు చెప్పారు.