ఈ ఏడాది కోల్‌కతా నైట్‌రైడర్స్ టీమ్‌ను కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ IPL ఛాంపియన్‌గా నిలిపాడు. అయినా సదరు ఫ్రాంచైజీ అతడిని రిటైన్ చేసుకోలేదు. అయితే మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు శ్రేయస్‌ను కొనుగోలు చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తమ దగ్గర ఉన్న రూ.73 కోట్లలో ఎక్కువ డబ్బు పెట్టి శ్రేయస్‌ను కొనుగోలు చేసి కెప్టెన్‌గా చేసేందుకు జీఎంఆర్ గ్రూప్ రెడీగా ఉందని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.