CTR: రాష్ట్ర ప్రభుత్వం రహదారి ప్రమాదాలను అరికట్టడంలో భాగంగా జిల్లాలోని రహదారులను గుంతల రహిత రహదారుల సాధన చేపట్టిందని కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. శనివారం చిత్తూరు పట్టణంలోని ఎఫ్సీఐ గోడౌన్ వద్ద గల స్టేట్ హైవే బీటీ రోడ్డుపై గల గుంతలను మరమ్మతు చేసే కార్యక్రమాన్ని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, మేయర్ అముదలతో కలసి కలెక్టర్ ప్రారంభించారు.