TG: ప్రధాని మోదీ విమర్శలపై CM రేవంత్ రెడ్డి స్పందించారు. అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని తెలిపారు. ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షల సదుపాయాన్ని అమల్లోకి తీసుకొచ్చామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని చెప్పారు. రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేశామని వివరించారు. బీజేపీపాలిత రాష్ట్రాల్లో గ్యాస్ ధరలు అధికంగా ఉన్నాయని.. తెలంగాణలో రూ.500లకే సిలిండర్ ఇస్తున్నామన్నారు.