‘పుష్ప’ సినిమాలో జాలీ రెడ్డిగా తనదైన విలనిజం చూపించిన కన్నడ నటుడు డాలీ ధనంజయ్.. పెళ్లి పీటలెక్కనున్నారు. ధన్యత అనే అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నారు. ఇప్పటికే వీరి నిశ్చితార్థం జరిగింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వారి పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. కాగా, తనకు కాబోయే భార్యను పరిచయం చేస్తూ.. ధనంజయ్ సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేశారు. ఈ జంటకు సినీ ప్రముఖులు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేశారు.