రష్యాపైకి క్షిపణులు ప్రయోగించడానికి అనుమతి కావాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తాజాగా పేర్కొన్నారు. రష్యాకు మద్దతుగా మోహరించిన ఉత్తర కొరియా సేనలను దీటుగా ఎదుర్కోవాలంటే క్షిపణులు ప్రయోగించాలని, అందుకు తమ మిత్ర దేశాల మద్దతు అవసరమని తెలిపారు. రష్యా తన భూభాగంలో సిద్ధంగా ఉంచిన ఉత్తరకొరియా సైనికుల ప్రతి స్థావరాన్ని తాము అంతుచూస్తామని.. తమ వద్ద సుదూర లక్ష్యాలను ఛేదించే సౌలభ్యం ఉంటే వారిని అడ్డుకోవడానికి వినియోగిస్తామన్నారు.