ఢిల్లీలో వాయు కాలుష్యం కారణంగా నగరవాసులు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని ‘లోకల్ సర్కిల్స్’ తన సర్వేలో వెల్లడించింది. ఢిల్లీ, నోయిడా, గురుగ్రాం, ఫరీదాబాద్, గజియాబాద్ నుంచి 21వేల మంది నివాసుల నుంచి శాంపుళ్ల సేకరించింది. ఈ సర్వే ఢిల్లీలో నెలకొన్న తీవ్ర పరిస్థితులను వెల్లడించింది. 69 శాతం కుటుంబాల్లో ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యులు గొంతు నొప్పి, దగ్గుతో బాధపడుతున్నట్లు సమాచారం.