NLR: ఉదయగిరి, సీతారాంపురం, వరికుంటపాడు మండలాల్లోని కొలను, చెరువులను ఇరిగేషన్ శాఖ ఈఈ ఆర్ వెంకటేశ్వర్లు శుక్రవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ఆగి ఉన్న ఉదయగిరి, చిన్ననాగంపల్లి ట్యాంక్ బండ్లు పునఃప్రారంభించామన్నారు. కృష్ణంపల్లి, ఇసుకపల్లి చెరువులు జైకా నిధులతో చేస్తున్నట్లు చెప్పారు. ఆయన వెంట డీఈ చంద్రమౌళి, జేఈ వేణు, సురేశ్ ఉన్నారు.