NLG: నిత్యం పని ఒత్తిడిలో ఉండే జర్నలిస్టులు ఉచిత మెడికల్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని నల్గొండ మున్సిపల్ ఛైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి అన్నారు. ఐకాన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జర్నలిస్టుల ఉచిత మెడికల్ క్యాంపును వారు ప్రారంభించి ప్రసంగించారు. వైస్ ఛైర్మన్ అబ్బగోని రమేష్ పాల్గొన్నారు.