KKD: వాలంటీర్లను విధుల్లో తీసుకోవాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఏపీ గ్రామ వార్డు వాలంటీర్స్ యూనియన్ (సీఐటీయూ) అనుబంధం ఆధ్వర్యంలో ప్రతిపాడు తాహశీల్దార్ కార్యాలయం వద్ద వాలంటీర్స్ శుక్రవారం రిలే నిరాహార దీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల ప్రధాన కార్యదర్శి ఈశ్వరరావు, జాకాబ్, తదితరులు పాల్గొన్నారు.