TG: CM రేవంత్ రెడ్డికి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ వసతిగృహ విద్యార్థులకు డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచిన నేపథ్యంలో వివిధ సంక్షేమ విభాగాల సెక్రెటరీలు CMను కలిశారు. ఈ నేపథ్యంలో పది రోజుల్లో కొత్త డైట్‌ను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం అధికారులను ఆదేశించారు. డైట్ చార్జీల పెంపు విషయంలో కమిటీ ప్రతిపాదనను యథావిధిగా అమలు చేయడంతో అధికారులు హర్షం వ్యక్తం చేశారు.