AP: అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో హోంమంత్రి అనిత పర్యటించారు. ఈ క్రమంలోనే ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీని ఆమె ప్రారంభించారు. అనంతరం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు నిర్లక్ష్యం వీడాలని సూచించారు. ఏ అధికారి ఎలా పనిచేస్తున్నారో తన దగ్గర డేటా ఉందని హెచ్చరించారు. ప్రజలను ఇబ్బంది పెడితే ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు.