TG: ‘ఆస్క్ కేటీఆర్’లో నెటిజన్ల ప్రశ్నలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమాధానాలు ఇచ్చారు. ప్రస్తుత రాజకీయాలు ఏ మాత్రం బాగాలేదన్నది వాస్తవమని అన్నారు. కేసీఆర్ ఆరోగ్యంగానే ఉన్నారని.. రోజూ తమకు మార్గనిర్దేశం చేస్తున్నారన్నారు. 2025లో కేసీఆర్ ప్రజల్లోకి వస్తారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల అమలు కోసం సమయం ఇస్తున్నారని చెప్పారు. పదేళ్లు అధికారంలో ఉన్న తర్వాత వచ్చే అసమ్మతి వల్ల ఓడిపోయామని పేర్కొన్నారు.