భారీ వరదలు స్పెయిన్‌ను అతలాకుతలం చేశాయి. ఇప్పటికే 100 మంది చనిపోగా.. వందలాది మంది వరదల్లో కొట్టుకుపోయారు. భారీగా వాహనాలు గల్లంతయ్యాయి. వేలాది ఇళ్లు నీట మునిగాయి. ఆస్తులు ధ్వంసం అయ్యాయి. జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తం అయింది. ప్రస్తుతం విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అంధకారం అలుముకుంది. సరైన వసతులు లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.