AP: పోలవరం ఎత్తుపై మాజీ సీఎం జగన్ తప్పుడు ప్రచారం మానుకోవాలని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పోలవరం ఎత్తు 41.15 మీటర్లకు తగ్గించాలని కేంద్రాన్ని కోరింది జగన్ కాదా అని ప్రశ్నించారు. పోలవరం ఎత్తు 45.72 మీటర్లు పెంచి నదుల అనుసంధానం చేస్తామని వెల్లడించారు. పోలవరం డయాఫ్రమ్ వాల్ విధ్వంసానికి కారుకులయ్యారని మండిపడ్డారు. రాష్ట్రానికి జల ద్రోహం చేసింది జగన్ కుటుంబమేనని ధ్వజమెత్తారు.