MNCL: జైభీమ్ సైనిక దళ్ మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శిగా మంచిర్యాలకు చెందిన దొంతమల్ల శివకుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనకు గురువారం జిల్లా అధ్యక్షుడు ఎర్రోళ్ల నరేశ్ నియామక పత్రం అందజేశారు. తనపై నమ్మకంతో జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర నాయకత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.