TG: సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం దగ్గర లోక కళ్యాణం కోసం ఆత్మార్పణ చేసుకుంటానని ప్రకటన చేసిన విషయం తెలిసిందే. కాగా, ఆలయానికి వెళ్తుండగా సిద్దిపేట వద్ద మహిళా అఘోరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆమె సొంత గ్రామమైన మంచిర్యాలీ జిల్లా నన్నెల మండలం కుశ్నపల్లికి భారీ భద్రత మధ్య పోలీసులు తరలించారు. అనంతరం అఘోరీని తల్లిదండ్రులకు అప్పగించారు. అంతేకాక కుశ్నపల్లి గ్రామంలో భారీగా పోలీసులను మోహరించారు.