ఇప్పుడంతా థ్రిల్లింగ్ మూవీస్ కి, సైకో కిల్లర్స్ వెబ్ సీరీస్(Web Series) కు డిమాండ్ పెరిగింది. తాజాగా అలాంటి కాన్సెప్ట్ తోనే 'పులి మేక'(Puli Meka) వెబ్ సీరీస్ రూపొందింది. తాజాగా ఈ వెబ్ సీరీస్ కు సంబంధించి ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్(Trailer Release) చేసింది.
ఇప్పుడంతా థ్రిల్లింగ్ మూవీస్ కి, సైకో కిల్లర్స్ వెబ్ సీరీస్(Web Series) కు డిమాండ్ పెరిగింది. తాజాగా అలాంటి కాన్సెప్ట్ తోనే ‘పులి మేక'(Puli Meka) వెబ్ సీరీస్ రూపొందింది. ఈ సినిమా ఓటీటీ(OTT) యూజర్లకు డబుల్ థ్రిల్లింగ్ కలిగించడానికి రెడీ అయిపోయింది. రీసెంట్ గానే ఈ సీరీస్ కు సంబంధించిన టీజర్(Teaser) ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. తాజాగా ఈ వెబ్ సీరీస్ కు సంబంధించి ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్(Trailer Release) చేసింది.
జీ5 ఓటీటీ(Z5 OTT)లో ఈ వెబ్ సిరీస్ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ సహా పలు భాషల్లో రిలీజ్ కానుంది. ఫిబ్రవరి 24వ తేదీన ఈ వెబ్ సీరీస్(Web Series) స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సీరీస్ లో లావణ్య త్రిపాఠి, ఆది సాయి కుమార్, సిరి హన్మంత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. డైరెక్టర్ బాబీ, హీరో సిద్ధు జొన్నలగడ్డ ఈ వెబ్ సీరీస్ ట్రైలర్ ను రిలీజ్(Trailer Release) చేశారు.
ట్రైలర్(Trailer) గమనించినట్లైతే ఇందులో డైలాగ్స్ అదుర్స్ అనిపిస్తున్నాయి. చావు చెప్పిరాదు, వచ్చినప్పుడు తప్పించుకోవడం సాధ్యం కాదు అంటూ ‘పులి మేక’ ట్రైలర్ రిలీజ్ కానుంది. బ్యాగ్రౌండ్ లో కనిపించే దృశ్యాలు బెస్ట్ టేకాఫ్ గా అనిపించాయి. ఇందులో పోలీస్ ఆఫీసర్ గా ఆది సాయికుమార్ కనిపించనున్నారు. పోలీస్ అఫిషియల్ గా సుమన్ నటించారు. ఓ సైకో పోలీస్ డిపార్టుమెంట్ ను టార్గెట్ చేశాడని ట్రైలర్(Trailer) ను చూస్తే అర్థమవుతోంది. ఈ కేసును డీల్ చేసే స్పెషల్ ఆఫీసర్ గా లావణ్య త్రిపాఠి(Lavanya tripati) కనిపించనుంది. జంతువులాంటి దుర్మార్గుడి కోసం లావణ్య త్రిపాఠి, ఆది తమ ప్రయత్నాలు మొదలు పెడుతారు. చివరికి ఏం జరుగుతోందో సీరీస్ స్ట్రీమింగ్ అయ్యాక తేలనుంది.