VZM: భోగాపురం సన్ రే రిసార్ట్స్‌లో జనసేన పార్టీ పీఏసీ మెంబర్, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీకాకుళంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దీపం-2 పథకాన్ని శుక్రవారం లాంచనంగా ప్రారంభించనున్నారు. ఆ కార్యక్రమంలో నాదెండ్ల పాల్గొంటారు. మంత్రితో ఆమె నియోజకవర్గంలో సమస్యలను విన్నవించారు.