NLR: నెల్లూరు నగరంలో నెహ్రూ యువ కేంద్ర, జిల్లా ప్రాధికార సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ ఐక్యత దినోత్సవం ర్యాలీ జరిగింది. స్థానిక ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నుంచి నిర్వహించిన ఈ ర్యాలీలో ముఖ్య అతిథులుగా జిల్లా యువజన అధికారి ఏ మహేంద్ర రెడ్డి జిల్లా క్రీడాభివృద్ధి అధికారి యతి రాజు, క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు.