AP: తిరుపతిలోని హోటళ్లకు మరోసారి బాంబు బెదిరింపులు రావడంతో కలకలం రేగింది. తిరుపతి పోలీసులకు బెదిరింపు కాల్స్ సవాల్‌గా మారగా, మూడు హోటల్స్‌లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఐఎస్ఐ పేరుతో బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లేకపోవడంతో పోలీసులు వెనుదిరిగారు. తిరుపతి, తిరుమల అత్యంత సేఫ్‌గా ఉన్నాయని ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు.