అన్నమయ్య: కర్ణాటక నుంచి మదనపల్లెకు అక్రమంగా మద్యం తీసుకు వస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఎక్సైజ్ సీఐ భీమలింగ కథనం మేరకు.. ఎస్టిఎఫ్ ఎక్సైజ్ ఎస్సైలు ఎల్లయ్య, శశిధర్ సిబ్బందితో వెళ్లి చీకిల బయలు సమీపంలోని మేడిపల్లి క్రాస్ వద్ద 87 కర్ణాటక మద్యం ప్యాకెట్లు తెస్తున్న జిల్లేల శ్రీనివాసులును అరెస్టు చేసి మద్యం ప్యాకెట్లను సీజ్ చేసినట్లు సీఐ తెలిపారు.