కాకినాడ: నవంబర్ నెలకు సంబంధించి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ప్రక్రియను అధికారులు లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా నిర్వహించాలని కాకినాడ కలెక్టర్ షాన్మోహన్ సూచించారు. ఈ మేరకు బుధవారం ఆయన మండల స్థాయి అధికారులతో కాకినాడ జిల్లా కలెక్టరేట్ నుంచి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కాకినాడ జిల్లాలో 2,74,740 లబ్ధిదారులకు రూ. 115.64 కోట్ల పెన్షన్లను అందించనున్నట్లు తెలిపారు.