కాకినాడ: తొండంగి మండలంలోని బెండపూడి గ్రామంలో పచ్చని పొలాల మధ్య విమానాశ్రయం వద్దంటూ సంబంధిత బాధిత రైతులు తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు. బుధవారం సుమారు 500 మంది రైతులు తమ పొలాల వద్ద నుంచి ర్యాలీగా రెవెన్యూ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం వారు తహసీల్దార్‌కు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.