NDL: టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ గౌడ్‌కు సీఎం చంద్రబాబు కీలక బాధ్యతలు అప్పగించారు. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పాలక మండలిలో ఆయనకు సభ్యుడిగా చోటు కల్పించారు. TTD నూతన ఛైర్మన్‌గా బీఆర్ నాయుడును నియమించగా, మరో 23 మందికి ఇందులో సభ్యులుగా అవకాశం కల్పించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.