ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ కీలక ప్రసంగం వినిపించారు. పాలస్తీనా ప్రజలకు మరింత సహాయ సహకారాలు అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు. ప్రస్తుతానికి తమ సాయం 120 మిలియన్ డాలర్లు (రూ.వెయ్యి కోట్లు)గా ఉందని తెలిపారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై జరిగిన దాడి నిస్సందేహంగా ఖండించదగినదిగా పేర్కొన్నారు. తక్షణమే బందీలను విడుదల చేసి కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవాలని సూచించారు.