»Hit Tv %e0%b0%a6%e0%b1%80%e0%b0%aa%e0%b0%be%e0%b0%b5%e0%b0%b3%e0%b0%bf %e0%b0%b6%e0%b1%81%e0%b0%ad%e0%b0%be%e0%b0%95%e0%b0%be%e0%b0%82%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%b2%e0%b1%81
హిట్ టీవీ యూజర్లకు దీపావళి శుభాకాంక్షలు. చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళిని జరుపుకుంటారు. నరకాసురుడు అనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. అలాగే, లంకలోని రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీసమేతంగా అయోధ్యకు తిరిగొచ్చినప్పుడు కూడా ప్రజలు ఆనందోత్సవాల మధ్య దీపావళి జరుపుకున్నారని రామాయణం చెబుతోంది.