NZB: నగరంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్య నారాయణ బుధవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనరల్ ఫండ్ ద్వారా ప్రతి డివిజన్‌కు పది లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. అందులో భాగంగా నగరంలో పలు డివిజన్లలో అభివృద్ధి కార్యక్రమాలు, సీసీ రోడ్, డ్రైనేజ్ నిర్మాణ పనులకు నేడు శంకుస్థాపన చేశామన్నారు.