TG: సీఎం రేవంత్‌రెడ్డి అబద్ధాలకు గోబెల్స్ కూడా సిగ్గుపడతారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. HYDకి సముద్రం ఉందన్న రేవంత్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయన్నారు. ఇప్పుడు ఎన్నికలు పెడితే BRSకు 100 సీట్లు వస్తాయని తెలిపారు. రేవంత్‌కు CM పదవి KCR పెట్టిన భిక్ష అన్నారు. KCR లేకుంటే తెలంగాణ వచ్చేది కాదని.. రేవంత్ CM అయ్యేవారు కాదని తెలిపారు. సీనియర్లు కుర్చీ లాక్కోకుండా రేవంత్ చూసుకోవాలని సూచించారు.