AP: మాజీ మంత్రి, వైసీపీ ఉత్తరాంధ్ర నేత సీదిరి అప్పల్రాజు అస్వస్థతకు గురయ్యారు. ఉదయం ఇంట్లో ఎక్సర్సైజులు చేస్తున్న సమయంలో అనారోగ్యానికి గురవ్వడంతో గమనించిన కుటుంబీకులు వెంటనే శ్రీకాకుళంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పల్రాజుకు వైద్యులు గుండె సంబంధిత పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు.