AP: పులివెందులలో పర్యటిస్తున్న మాజీ సీఎం జగన్ తన క్యాంపు ఆఫీసులో ప్రజాదర్బార్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన వినతులను పరిశీలించారు. ఉల్లి రైతులు జగన్ ను కలిసి.. తమ కష్టాలను చెప్పుకున్నారు. ఎకరాకు లక్ష పెట్టుబడి పెట్టినా కనీసం రవాణా ఛార్జీలు కూడా రాలేదని వాపోయారు. ఈ నేపథ్యంలో అధికారులతో మాట్లాడతానని, అవసరమైతే పోరాటం చేద్దామని రైతులకు హామీ ఇచ్చారు.