AP: కడప జిల్లా జమ్మలమడుగు మండలం పెద్దతండూరులో ఘర్షణ తలెత్తింది. పొలం వివాదంలో వైసీపీ, కూటమి వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వైసీపీ మద్దతుదారులను ఆస్పత్రిలో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి పరామర్శించారు. జమ్మలమడుగులో గతంలో ఫ్యాక్షన్ జరిగేదని.. ఇలాంటి ప్రదేశాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.