AP: ఉచిత గ్యాస్ సిలిండర్లపై అపోహలను నమ్మొద్దని నాదెండ్ల మనోహర్ అన్నారు. ప్రతి ఒక్కరూ కేవైసీ చేసుకోవాలని సూచించారు. ఒక్కరోజే 4.5 లక్షల బుకింగ్స్ వచ్చాయని తెలిపారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి ఐదేళ్లకు రూ.13 వేల కోట్లు ఖర్చు అవుతుందని పేర్కొన్నారు. ఈ పథకంతో ఎంతో మంది పేదలకు మేలు కలుగుతుందని చెప్పారు.