గతంలో టీమిండియా చేతిలో 2 సార్లు ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ అన్నాడు. ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో IND Vs AUS తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో హ్యాట్రిక్‌పై కన్నేసిన టీమిండియాను అడ్డుకుంటామని కమిన్స్ స్పష్టం చేశాడు. భారత్‌తో 5 టెస్టుల సిరీస్ అతిపెద్ద కఠిన సవాల్‌తో కూడుకున్నదే అయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామన్నాడు.