TG: దేశంలో కులగణన జరగాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భావించారని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ అన్నారు. భారత్ జోడో యాత్రలోనే ఈ నినాదం తీసుకున్నారని తెలిపారు. కులగణన కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన అని పేర్కొన్నారు. నిష్పక్షపాతంగా, సమగ్రంగా కులగణన చేస్తామని చెప్పారు. పార్టీతో పాటు అన్ని వర్గాలు ఇందులో భాగస్వామ్యం చేస్తామన్నారు.