ELR: చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామంలో బుధవారం భూవివాదం తలెత్తింది. ఇరువర్గాల ఘర్షణలో గోలి సరోజిని అనే వృద్దురాలిపై కత్తితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడింది. దీంతో సరోజినిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న చింతలపూడి ఎస్సై కుటుంబరావు ఆస్పత్రికి వెళ్లి సరోజిని పరామర్శించి వివరాలు అడిగి కేసు నమోదు చేశారు.