PPM: పార్వతీపురం స్థానిక బైపాస్ రోడ్డులో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్డు గుంతలమయంగా మారింది. ఈ నేపథ్యంలో అటు వైపు వెళుతున్న వాహనాలు అందులో ఇరుక్కుపోయి వాహన చోదకులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ ఇబ్బందులను చూసి స్థానిక పట్టణ సీఐ వి.నారాయణరావు బుధవారం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి గుంతలు పూడ్పించారు.