ఖమ్మం: నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురం గ్రామంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని వచ్చే నెల 13 నుంచి ఎద్దుల బల ప్రదర్శన, కబడ్డీ పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటన విడుదల చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల స్థాయిలో నిర్వహించనున్న ఈ పోటీలు మూడు రోజులపాటు జరగనున్నట్లు తెలిపారు. ఎంట్రీలు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.