W.G: ధాన్యం విక్రయించిన 48 గంటల్లో రైతుల ఖాతాకు సొమ్ములు జమ అయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే శ్రీనివాస్ అన్నారు. మంగళవారం తాడేపల్లిగూడెం మండలం పెదతాడపల్లి రైతు సేవ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జేసి రాహుల్ కుమార్ రెడ్డి, అధికారులు, ప్రజా ప్రతినిధులు,ఆర్డీవో ఖతీబ్ కౌసర్ బనోతో కలిసి ఆయన ప్రారంభించారు.