ప్రొ కబడ్డీ సీజన్ 11 ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఇందులో భాగంగా ఇవాళ రెండు మ్యాచ్లు జరగనున్నాయి. గుజరాత్ జెయింట్స్, తమిళ్ తలైవాస్ మధ్య రాత్రి 8 గంటలకు మొదటి మ్యాచ్ జరగనుంది. అలాగే యూపీ యోథాస్, హర్యానా స్టీలర్స్ మధ్య రాత్రి 9 గంటలకు రెండో మ్యాచ్ జరగనుంది. హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో ఈ మ్యాచ్లు జరుగుతున్నాయి.