TG: రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకోనున్నారు. ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపును తిరస్కరించడంతో.. జిల్లా కేంద్రాలు, నియోజకర్గాల్లో బీఆర్ఎస్ నేతలు సంబరాలకు పిలుపునిచ్చారు. రూ.18,500 కోట్ల విద్యుత్ భారాన్ని.. ప్రజలపై పడకుండా అడ్డుకున్నామని వారు పేర్కొన్నారు. ఈఆర్సీని తాము ఒప్పించడం వల్లే డిస్కంల ప్రతిపాదనలను తిరస్కరించిందన్నారు.