MDK: చిన్న శంకరంపేట మండలం గవ్వలపల్లి ప్రాథమికోన్నత పాఠశాలను ఎంఈఓ పుష్పవేణి ప్రార్థన సమయంలో సందర్శించారు. అనంతరం సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసి రికార్డులను పరిశీలించారు. పాఠశాల కార్యక్రమాల పట్ల సూచనలు, సలహాలు చేశారు. సమయపాలన పాటించని ఉపాధ్యాయుల పట్ల చర్యలు తప్పవని అన్నారు.