WNP: త్వరలో ప్రారంభమయ్యే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు ప్రణాళికాబద్ధంగా సన్నద్ధం కావాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, యం.నగేశ్, అధికారులు, తహశీల్దార్లతో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సమగ్ర ప్రణాళికతో సర్వేకు సిద్ధం కావాలని ఆదేశించారు.