TG: నవంబర్ 2న హోంగార్డులు ఆందోళనకు పిలుపునిచ్చారు. డిమాండ్ల సాధన, సమస్యల పరిష్కారానికి హోంగార్డులు HYDలోని ఇందిరాపార్క్ వద్ద శాంతియుత నిరసన చేయనున్నట్లు సమాచారం. అధికారంలోకి రాకముందు హామీలిచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వినతులను పట్టించుకోవట్లేదని అన్నారు. తమకు ADG ర్యాంకు ఉన్న అధికారి ఉన్నా.. జీతభత్యాలు, సమస్యల పరిష్కారం కరువైందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎంతో చర్చలకు తమను పిలిచి సమస్యలు పరిష్కారించాలని వారు కోరారు.