WNP: తెలంగాణలో డ్రగ్స్ కల్చర్ నిర్మూలనకు ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు, వనపర్తి జిల్లా వాసి శివసేనా రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆరోగ్యమైన సమాజం నిర్మాణం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. గడచిన పది సంవత్సరాల్లో డ్రగ్స్ కల్చర్ బాగా పెరిగిందని ఆరోపించారు. యువకులను మత్తు పదార్థాలకు బానిస చేశారన్నారు.