ATP: పదవ తరగతి పబ్లిక్ పరీక్షల రుసుము నవంబర్ 11వ తేదీ లోపల చెల్లించాలని చిట్వేలు మండల విద్యాశాఖ అధికారి కోదండ నాయుడు తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ రెగ్యులర్ విద్యార్థులు ప్రధానోపాధ్యాయుడు ద్వారా రూ.125 రుసుము చెల్లించాలని తెలిపారు. నవంబర్ 12 నుంచి 18 లోపు చెల్లిస్తే రూ.50, 19 నుండి 25 వరకు 200, 26 నుండి 30 వరకు అదనంగా రూ.500 రుసుము చెల్లించాలన్నారు.