తిరుపతి: శ్రీకాళహస్తిలో ఇసుక మాఫియా అక్రమాలు విచ్చలవిడిగా సాగుతున్నాయని, ప్రభుత్వం ప్రకటించిన ఉచిత ఇసుక పథకం అమలు కావడంలేదని నిరసిస్తూ శ్రీకాళహస్తి ఆర్డీఓ కార్యాలయం ఎదుట వామపక్ష పార్టీలు ఆందోళన చేపట్టాయి. సీపీఐ జిల్లా కార్యదర్శి పుల్లయ్య, సీఐటీయూ నాయకులు మణి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి ఉచిత ఇసుక పథకాన్ని సక్రమంగా అమలు చేయాలంటూ నినాదాలు చేశారు.