TPT: తిరుమల శ్రీవారిని సోమవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఛత్తీస్గఢ్ గవర్నర్ రామెన్ దేక కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. ముందుగా ఆలయ మహద్వారం వద్ద డిప్యూటీ ఈవో లోకనాథం గవర్నర్కు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయ రంగనాయకులు మండపంలో వేద ఆశీర్వచనంతో ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.